KMM: వేంసూరు మండలం మర్లపాడులోని శ్రీ సాయిబాబా ఆలయంలో శుక్రవారం ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.