PDPL: సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల రంగనాయక స్వామి ఆలయంలో ఈనెల 29న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముద్దసాని శంకర్ తెలిపారు. సమ్మక్క- సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న సందర్భంగా బెల్లం, టెంకాయలు, పుట్నాలు, పేలాలు, తలనీలాలు, లడ్డు-పులిహోర ప్రసాదం, కోళ్లు విక్రయ హక్కుల కోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తామన్నారు.