SRPT: మఠంపల్లి మండలం పెదవీడులో సుమారు 3 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరు అందించే పెదవీడు లిఫ్ట్ మరమ్మతులకు ఆర్థిక సహాయం చేయడానికి దాతలు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక రైతులు మల్ రెడ్డి ఆది నారాయణ రెడ్డి ఒక లక్ష రూపాయిలు, పశ్య నరసింహరెడ్డి రూ.50 వేలు, సాముల కోటి రెడ్డి రూ.50 వేలు, చెక్కులను లిఫ్ట్ ఛైర్మన్ అన్నెం నరసింహరెడ్డికి అందజేశారు.