JN: మేకలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి మండల వైద్య అధికారి దేవి రెడ్డి అశోక రెడ్డి అన్నారు. మండలంలోని గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నట్టల నివారణ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. గొర్రెలకు, మేకలకు వచ్చే వ్యాధులను పెంపకం దారులు గుర్తించాలని సూచించారు. అందుబాటులో ఉన్న గోపాలమిత్రకు సమాచారాన్ని అందించాలన్నారు.