హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘ఈషా’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా నిర్వహించిన ఈ మూవీ ప్రెస్ మీట్లో నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశాడు. కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని అన్నాడు. తాను గతంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఇప్పుడు ‘ఈషా’ టీం అనుభవిస్తున్న బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపాడు.