ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘రివాల్వర్ రీటా’. నవంబర్లో రిలీజైన ఈ సినిమా తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఇక దర్శకుడు జే.కే చంద్రు తెరకెక్కించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.