మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో 106 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్‌లో 37, బస్తర్ 16, నారాయణపూర్‌లో నలుగురు, కాంకేర్‌లో ముగ్గురు, సుక్మాలో 18, దంతెవాడలో 30 మంది లొంగిపోయినట్లు సమాచారం. వీరితో పాటు భారీగా ఆయుధాల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.