ఉమ్మడి WGL జిల్లాలో యాసంగి పనులు ప్రారంభమైనప్పటికీ డిసెంబర్ ముగిస్తున్నా రైతు భరోసా పథకంపై ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములు గుర్తించి పంటలు పండించిన వారికి మాత్రమే భరోసా ఇస్తామని మంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.