AKP: కసింకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈనెల 20న YCP అధినేత జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు హెచ్ఎం స్వర్ణ కుమారికి డీఈవో అప్పారావు నాయుడు షోకాస్ నోటీస్ జారీ చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం ఆమెకు షోకాస్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో మంగళవారం తెలిపారు. నోటీసుపై మూడు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలన్నారు.