వరంగల్ ఇంతేజర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేశాయిపేట ఎంఎస్ రెడ్డి కాలనీలో జూదం ఆడుతున్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.61,960 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, ఇంతేజర్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఎసీపీ మధుసూదన్ తెలిపారు.