NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను బుధవారం అచ్చంపేట పట్టణంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ప్రజాసేవ చేస్తున్నందుకు అభినందిస్తూ ఈ సన్మానం చేసినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, రఘుపతి రెడ్డి, యాదయ్య గౌడ్, భరత్, రాజు, ప్రశాంత్ రెడ్డి, జూలూరి సురేశ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.