»Sejals Sensational Evidence Released Against Bellampalli Mla Durgam Chinnaiah
MLA Durgam Chinnaiah:పై శేజర్ సంచలన ఆధారాలు రిలీజ్
బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి ఇప్పటికే ఆరోపణలు చేయగా..తాజాగా ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. అయితే వాటిని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.
తెలంగాణ బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం చేయాలంటూ కొద్దిరోజుల కిత్రం తెలంగాణ భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ యువతి మరోసారి తన వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఇప్పటికే తెలుపగా..తాజాగా ఓ వీడియోకు సంబంధించిన ఫొటోను శేజల్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో భాగంగా తాను కూడా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ఉన్నట్లు తెలిపింది.
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో (రూం నెంబర్ 404)లో తనను మందు తాగాలని ఎమ్మెల్యే(mla) కోరాడని వెల్లడించింది. అంతేకాదు బిజినెస్ మీటింగ్ అని పిలిచి మందు పార్టీ ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఆ క్రమంలో దుర్గం చిన్నయ్య మందు తాగుతూ తనను వేధింపులకు గురి చేశాడని స్పష్టం చేసింది. మరోవైపు ఆయనకు సపోర్ట్ చేస్తున్న పలువురు అది ఎమ్మెల్యే రూం కాదని తప్పుగా చెబుతున్నారని తెలిపింది. కానీ వీడియోలో భాగంగా ఆ రూములో ఎమ్మెల్యే తన భార్యతో ఉన్న ఫొటో గోడకు ఉంది చూడాలని వెల్లడించింది.
అంతేకాదు ఇంకా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని శేజల్(Sejal) పేర్కొంది. తానకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నట్లు తెలిపింది. ఇంకోవైపు తన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారని బాధితురాలు చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తుంటే తానేలా ఫొటోలు, వీడియోలు తీయాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేసింది. అప్పటి వరకు ఢిల్లీలోనే ఉంటామని వెల్లడించింది. దుర్గం చిన్నయ్య మూడు నెలలుగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని శేజల్ చెప్పింది. ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని, తమకు ఏ పార్టీ సపోర్ట్ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.