GDWL: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని అలంపూర్ 8వ వార్డు కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు అన్నారు. బుధవారం వార్డులోనీ పలు విద్యుత్ స్తంభాలకు దీపాలు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన ఆమె వెంటనే స్పందించి కొత్త దీపాలను ఏర్పాటు చేయించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.