WGL: పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన కొంగ రమాదేవి (48) బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు కుటంబ కలహాలే కారణమని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. భర్త ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.