AP: తొలి ఏడాది ఎగ్గొట్టిన తల్లికి వందనం ఎప్పుడిస్తారని అడిగితే చంద్రబాబు జవాబు ఇవ్వలేదంటూ మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’20 లక్షల మందికి తల్లికి వందనం కట్.. పైగా ఏ ఒక్కరికీ రూ.15 వేలు ఇవ్వలేదు. ఉచిత బస్సు ప్రయాణం కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉంది. అన్నదాత-సుఖీభవ తొలి ఏడాది ఎగ్గొట్టారు. దీనికింద ప్రతి రైతుకు రూ.30 వేలు బాకీ ఉన్నారు’ అని పేర్కొన్నారు.