ములుగులో 30 వేల మెజార్టీతో గెలుస్తామని మంత్రి ఎర్రబెల్లి (Minister Errabelli) దయాకర్‌రావు చేసిన కామెంట్స్‌పై ఎమ్మెల్యే సీతక్క(MLA Sitakka) స్పందించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేనే గెలుస్తా ఎన్నికలప్పుడే ప్రజలకు తెలుసాని ఆమె అన్నారు. ములుగు నియోజకవర్గాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు.ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు (Godavari waters) అందించేలా రామప్ప నుండి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని సీతక్క కోరారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలన్నారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేసి.. గిరిజన యూనివర్సిటీ (Tribal University) తరగతులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని కేటీఆర్ ను కోరారు సీతక్క. మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్ లో బిల్ట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలన్నారు. ఏటూరు నాగారం(Eturu Nagaram)ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. మంగపేట కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాల, గోవిందరావుపేట మండలం పసర కేంద్రంగా సమ్మక్క సారాలమ్మ నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలన్నారు. మల్లంపల్లి, లక్ష్మీదేవిపేట, రాజుపేటలను మండలాలుగా ప్రకటించాలని సీతక్క డిమాండ్ చేశారు.అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవటం లేదని ఆమె అన్నారు.