E.G: కొబ్బరి ధరలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. గత వారం రూ.17 నుంచి రూ.18 ఉన్న ధర ఒక్కసారిగా పడిపోయి బుధవారంకి రూ.14 నుంచి రూ.15 కి పడిపోయిందని వ్యాపారస్తులు అంటున్నారు. యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోయి కంటైనర్లు పోర్టుల్లోనే నిలిచిపోయాయి. దీంతో కొబ్బరి ధరలు అగాధంలోకి పడి పోతున్నాయి. ఒకే సారి కొబ్బరి ధర ఇంతలా పతనం కావడం ఎప్పుడూ జరగలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.