హీరో శర్వానంద్‌తో దర్శకుడు శ్రీను వైట్ల ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా 2026 జనవరి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్లో శర్వాపై పాటతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటించనుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్.