బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా జంటగా దర్శకుడు మిలాప్ జవేరి తెరకెక్కించిన సినిమా ‘ఏక్ దీవానే దీవానియత్’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది.