TG: నిజామాబాద్ జిల్లా జలాల్పూర్లో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. క్రాప్‌లోన్ కట్టేందుకు రైతు ఇచ్చిన నగదులో బ్యాంకు అధికారులు నకిలీ నోట్లను గుర్తించారు. రైతుకు నకిలీ నోట్లు ఎవరు ఇచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంచినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.