AP: తెలంగాణను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. విభజన బిల్లు సమయంలో అప్పటి స్పీకర్ మీరా కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే అంశాన్ని మాత్రమే తాను ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు అనవసరంగా ప్రాంతీయ సెంటిమెంట్‌ను రాజేయొద్దని ఆయన హితువు పలికారు.