ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. అందుకే భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. నాగార్జున కీలక పాత్రలో బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కింది బ్రహ్మాస్త్ర. తెలుగులో రాజమౌళి సమర్పణలో రానుంది. దాంతో బ్రహ్మాస్త్ర పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక రాజమౌళికి తోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బ్రహ్మాస్త్ర కోసం రంగంలోకి దిగుతున్నాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. దాంతో సెప్టెంబర్ 2న హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ వస్తున్నాడు. దాంతో ఎన్టీఆర్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకోగా.. ఇప్పుడు తారక్ రాకతో బ్రహ్మాస్త్ర పై అంచనాలు.. నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఇక రాజమౌళి బ్రహ్మాస్త్ర అసలు కథ గురించి చెబుతూ.. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘దర్శకుడు అయాన్ ముఖర్జీ 2016లోనే తనకు బ్రహ్మస్త్ర కథ చెప్పాడని.. మన పురణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నింటిని కలిపి అస్త్రావర్స్ క్రియేట్ చేశాడని చెప్పాడు. అలాగే అస్త్రావర్స్ అంటే ఏంటో కూడా చెప్పాడు. బ్రహ్మస్త్ర కథ ఆ బ్రహ్మ శక్తి నుంచి పుట్టిన అస్త్రాల గురించి.. వాటిని ఉపయోగించే సూపర్ హీరోల గురించి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దానికి ఎగ్జాంపుల్‌గా వానరాస్త్రగా నటించిన నాగార్జున క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఇందులో నాగ్‌కు కింగ్ కాంగ్‌కు ఉన్నంత బలం ఉంటుందన్నాడు. మొత్తంగా బ్రహ్మస్త్ర ఓ విజువల్ వండర్‌గా రాబోతోందని.. దాన్ని లవ్ అనే శక్తితో అద్భుతంగా మలిచారని.. సినిమా గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు జక్కన్న. అలాగే సెప్టెంబర్ 9న ఈ సినిమాను తప్పక చూడండని సెలవిచ్చాడు దర్శక ధీరుడు. దాంతో బ్రహ్మాస్త్ర పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.