ASR: కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ఠ ధరలు లభిస్తున్నాయి. దీంతో ప్రైవేటు వర్తకులు జీసీసీ, మ్యాక్స్ పోటీపడి గిరిజన రైతుల నుంచి కాఫీ గింజలు, పండ్లను కొనుగోలు చేస్తున్నారు. శుక్రవారం కొచ్చిన్ మార్కెట్లో కాఫీ కిలో పార్చిమెంట్ రూ.520-540, చెర్రీ రూ.270-305 ధర లభించినట్టు మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు సీనియర్ లైజనింగ్ అధికారి ఎస్. రమేశ్ తెలిపారు.