నెల్లూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి క్రికెట్, త్రోబాల్ పోటీలు నేటి నుంచి నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఇందుకూరుపేట మండలం పల్లెపాడు డైట్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా డివిజన్ స్థాయిలో విజేతల నిలిచిన వారు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు.