అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమా మొదటగా ఈనెల 26న విడుదల కానున్నట్లు ప్రకటించగా, తాజాగా వాయిదా పడింది. జనవరి 1న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా, నందు విలన్ పాత్రలో నటించారు.