TG: రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పేరిట డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రూ.94 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయనున్నారు. వారికి హెల్త్ కార్డులు కూడా జారీ చేయనున్నారు.