ADB: మావల మండలంలోని వాఘాపూర్లో పశు వైద్య అధికారులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి ధూద్ రామ్ రాథోడ్ మాట్లాడుతూ.. పశువులకు ఈ వ్యాధి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు తప్పనిసరిగా వేయించాలని రైతులకు సూచించారు. ఇందులతో ఆయనతో పాటు సిబ్బంది శ్రీదర్, గౌతమ్, పోచన్న, రమేష్, తదితరులు ఉన్నారు.