సత్యసాయి: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో జిల్లా ప్రజలు ప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.