»Breaking Four Children Died While Swimming In Gadwal District
Breaking : గద్వాల్ జిల్లాలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
ఈతకు వెళ్లిన నలుగురు మృతిచెందడంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఘటనా స్థలి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
తెలంగాణ(Telangana)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గద్వాల్ జిల్లా(Gadwal District)లో విషాదం ఘటన నెలకొంది. ఈత(Swimming)కు వెళ్లిన నలుగురు చిన్నారుల మృతి (4 Died)చెందిన ఘటన ఇటిక్యాల మండలంలో జరిగింది. సోమవారం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో నలుగురు మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను(Dead bodies) వెలికి తీశారు. మృతి చెందినవారిన అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) అని పోలీసులు గుర్తించారు.
ఈత(Swimming)కు వెళ్లిన నలుగురు మృతి(4 Died)చెందడంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఘటనా స్థలి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఆలంపూర్ నియోజవకర్గంలో కృష్ణా నదిని చూసేందుకు 11 మంది ఆటోలో వెళ్లి నదిలో దిగారు. అయితే ఆ చిన్నారులకు ఈత(Swimming) రాకపోవడంతో నీట మునిగి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలురు మృతిచెందడంతో చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.