BDK: అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామపంచాయతీకి చెందిన సర్పంచ్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టేందుకు తన వంతుగా సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.