కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదఘటన ఏపీలోని గుంటూరు జిల్లా(guntur district) వట్టిచెరుకూరులో జరిగింది. అయితే ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.