Ileana: బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసినా ఇలియానా.. బిడ్డకు తండ్రి ఇతడే!?
కొన్ని రోజుల క్రితం ప్రెగ్నెన్సీని ప్రకటించి షాక్ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. అయితే పెళ్లి కాకుండానే ఇల్లీ బేబి తల్లి కావడం ఏంటి? అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరు? పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అసలు పెళ్లి చేసుకుందా? అనే డౌట్స్ వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఇలియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.
ఒకప్పుడు తన అందంతో టాలీవుడ్(Tollywood)ను ఓ ఊపు ఊపేసింది ఇలియానా(Ileana). దేవదాసుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి, మున్నా, జల్సా వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా రాణించింది. అంతేకాదు టాలీవుడ్లో కోటి పారితోషికం అందుకున్న బ్యూటీల్లో ఇలియానాదే ఫస్ట్ ప్లేస్. అలాంటి ఈ గోవా బ్యూటీ బాలీవుడ్‌కు వెళ్లి.. ఇక్కడ ఆఫర్లకు దూరమైంది. అనుకున్నంత రేంజ్లో బాలీవుడ్లో సక్సెస్ అవలేకపోయింది.
అయితే సినిమాల కంటే.. ప్రేమ విషయంలోనే ఇలియానా(Ileana) గురించి ఎక్కువగా చర్చించుకునేలా చేసింది. గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో పడింది ఇలియానా. అతనితో చాలా కాలం పాటు చెట్టపట్టాలేసుకొని తిరిగింది. కానీ చివరికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి ఒంటిరిగానే ఉన్న ఇల్లీ బేబి.. రీసెంట్గా ప్రెగ్నేన్సి అంటూ షాక్ ఇచ్చింది. దాంతో నీ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని అడుగుతున్నారు నెటిజన్స్. కానీ ఇల్లీ బేబి మాత్రం ఈ విషయాన్ని బయటపెట్టడం లేదు.
అయితే తాజాగా అతనెవరో చెప్పుకోండి అనేలా ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఫేస్ కనబడకుండా.. కేవలం వాళ్ల చేతులు, వేళ్లకు ఉన్న రింగ్స్ మాత్రమే చూపించింది. తాను తల్లి కావడానికి కారణమైన వ్యక్తి ఇతడేనని హింట్ ఇచ్చింది. అంతేకాదు.. ‘నా రొమాన్స్ చేసే విధానం ఇదే.. కచ్చితంగా అతన్ని ప్రశాంతంగా తిననివ్వను’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటో షేర్ చేసింది. దీంతో ఇతనే ఇలియానా(Ileana) బాయ్‌ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ అతనెవరు? అనేది తెలియడం లేదు. అయితే.. బాలీవుడ్ టాక్ ప్రకారం ఇలియానా.. కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. బహుశా ఇలియానా బిడ్డకు తండ్రి అతడే అయి ఉండవచ్చు.. అని అంటున్నారు. మరి ఇలియానా తన హస్పెండ్ను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి.