NRPT: రేపు జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మండలంలోని సింగారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కలెక్టర్ బంగ్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి రెవెన్యూ శివారులోకి రావడంతో ఆమె పేరు ఆ గ్రామ ఓటర్ జాబితాలో నమోదు చేశారు.