Adah Sharma: ఆల్కహాల్ లేకుండా కూడా ఆ పనులు చేస్తానంటున్న అదా శర్మ..!
ఒక కొత్త ఇంటర్వ్యూలో అదా శర్మ(Adah Sharma) తన పరిశ్రమలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఓ సినిమా చేసిన తర్వాత తన ముక్కు గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. అయితే గతంలో పలువురు అదాశర్మ ముక్కు బాలేదని కామెంట్లు చేశారని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.
‘‘ది కేరళ స్టోరీ(the kerala story)’’పై జరుగుతున్న చర్చలో నటి అదా శర్మ(Adah Sharma) పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ప్రధానంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వీటిలో ఒక పాత్రలో అదా శర్మ నటించారు. చాలా ఏళ్ల నుంచీ అదా శర్మ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే, ఈ స్థాయి ప్రజాదరణ ఆమెకు ఎప్పుడూ లేదు. తెలుగులో నితిన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ, ఏవీ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయాయి. దీంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడా పెద్దగా సినిమాలు క్లిక్ కాలేదు. కానీ ఆమె శ్రమకు కేరళ స్టోరీ సినిమాతో గుర్తింపు లభించింది. అందులో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
కాగా ఈ సందర్భంగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో సైతం చురుకుగా పాల్గొంటున్నారు. తన వ్యక్తిగత(personal) విషయాలను సైతం పంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి అందరూ తన ముక్కు బాగోదు అనేవారట. దానికి సర్జరీ చేయించుకోమని చాలా మంది సలహా ఇచ్చారని ఆమె అన్నారు. అయితే, తాను చేయించుకోలేదని, ఇక ఇప్పుడు ఆలస్యమైందని ఆమె అన్నారు. కానీ ఇప్పుడు అందరికీ తన ముక్కు నచ్చుతోందని ఆమె అన్నారు.
ఇక తన మాజీ ప్రేమికుల గురించి కూడా ఆమె చెప్పారు. నిజానికి బ్రేకప్ తర్వాత ఎవరూ తమ మాజీల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ తాను మాత్రం తమ మాజీ ప్రేమికులతో తానే స్వయంగా ఫోన్(call) చేసి మాట్లాడతానని ఆమె చెప్పడం విశేషం. వాళ్లతో మాట్లాడటానికి తాను ఎలాంటి ఆల్కహాల్ తీసుకోనని, తనకు ఆ అవసరం లేదు అని చెప్పారు. జస్ట్ దగ్గు ముందు తాగినా, తాను తన ఎక్స్ కి ఫోన్ చేసి మాట్లాడతానని ఆమె చెప్పడం విశేషం.