Neelam Gill: టైటానిక్ హీరో కొత్త గర్ల్ ఫ్రెండ్..ఎవరీ నీలమ్ గిల్..?
హాలీవుడ్ హీరో, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియోకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఆయన కారణంగా ఇప్పుడు ఓ యువతి ఫేమస్ అయ్యింది. ఆయన నీలమ్ గిల్(Neelam Gill) అనే మోడల్ తో డేటింగ్ చేస్తున్నారట. డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. దాదాపు 30ఏళ్ల వయసు గ్యాప్ ఉన్న హీరోతో ఈ మోడల్ డేటింగ్ చేస్తుండటంతో..అందరూ ఈమె అసలు ఎవరు అని తెలుకునే పనిలో పడ్డారు.
నీలమ్ బ్రిటీష్-పంజాబీ మోడల్. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటుంది. ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నిర్వహిస్తున్న నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె విచ్చేసింది.
మరోవైపు డికాప్రియో ప్రియురాళ్ల జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. తన జీవితంలో ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. చాలా మందితో డేటింగ్ చేశాడు.
చివరగా మోడల్, నటి కామిల్లాతో నాలుగేళ్ల పాటు కలిసుండి 2022లో విడిపోయాడు. ప్రస్తుతం నీలమ్ తో డేటింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది.