బాలీవుడ్ స్టారో హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh khan) లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో షారుఖ్ ముక్కుకు గాయం కాగా, USలో చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, ముక్కుకు రక్తస్రావం కావడం వల్ల కింగ్ ఖాన్‌కు చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందని అతని డాక్టర్ల బృందం సమాచారం అందించారు. ఆపరేషన్ తర్వాత SRK ముక్కుకు కట్టుతో కనిపించాడని సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఇప్పుడు ముంబైలోని తన ఇంటికి తిరిగి వచ్చారని, కోలుకుంటున్నారని తెలుస్తోంది.