KRNL: ఆదోని జిల్లాగా ప్రకటించాలని జరుగుతున్న రిలే దీక్షలకు 26వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలకు PDSO విద్యార్థి సంఘం మద్దతు తెలిపింది. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేశ్ మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటుతోనే క్లస్టర్ యూనివర్సిటీ, కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు, సాగునీటి ప్రాజెక్టులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామన్నారు.