KDP: ఏ.పీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలను వినిపించేందుకు మైదుకూరుకు చెందిన కోటయ్య గారి మల్లికార్జున మూర్తిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవిలో మూడు సంవత్సరముల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా మల్లికార్జున మూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం న్యాయవాదిగా నియమించినందుకు కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.