ASF: కౌటాల మండలంలోని కుంబారి, తాటిపల్లి, మొగడ్ ధగడ్ గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA హరీష్ బాబు గురువారం ప్రచారాన్ని నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. BJP అభ్యర్థులను గెలిపిస్తే గ్రామంలో పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ప్రలోభాలకు, డబ్బులకు లొంగవద్దని గ్రామస్తులను కోరారు.