WGL: ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తన స్వగ్రామమైన పర్వతగిరిలోని ఎనిమిదో వార్డులో ఎర్రబెల్లి నేడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తండ్రి జగన్నాధరావు ఈ గ్రామానికి 30 సంవత్సరాలు సర్పంచ్‌గా గ్రామానికి సేవ చేశారని గుర్తు చేసుకున్నారు.