కర్ణాటకలో 2.84 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. వీటిల్లో అత్యధికంగా పాఠశాల, విద్య, అక్షరాస్యత శాఖలో 79,694 ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో నిరుద్యోగులకు గరిష్ట వయసు పరిమితి దగ్గరపడుతుందని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజాపూర్ సిటీ ఎమ్మెల్యే బసన్న గౌడ్ పాటిల్ డిమాండ్ చేశారు.