MDK: పెట్రోల్ బంకుల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు కల్పించిన కనీస మౌలిక వసతులను పరిశీలించారు.