KNR: పంచాయతీ ఎన్నికల్లో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలిగే వారినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. శంకరపట్నం మండలం కరీంపేట, మెట్ పల్లి,ఆముదాలపల్లి, కాచాపూర్, కొత్తగట్టు, చింతలపల్లి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.