KNR: శంకరపట్నం మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 27 సర్పంచ్ స్థానాలకు 111 మంది అభ్యర్థులు, 192 వార్డులకు 493 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటికే 48 వార్డులు ఏకగ్రీవమయ్యా యి. మొత్తం 37,386 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా, అధికారులు 240 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.