అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. బ్రౌన్ విశ్వవిద్యాలయం రోడ్ ఐలాండ్‌లోని క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.