ATP: తాడిపత్రిలోని అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి దేవస్థానంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాసం వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి అలంకరణకు దాతలు నూతన ఆభరణాలను అందజేశారు. దేవస్థానం అధ్యక్షుడు సురేంద్రనాథ్కు ఆభరణాలు అప్పగించారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారిని ఈ నూతన ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు.