MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఆదివారం పోలింగ్ కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి తప్పులకు తావు లేకుండా పోలింగ్ కౌంటింగ్ నిర్వహించాలన్నారు. వార్డు సభ్యుల సంఖ్యను బట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.