TG: ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ మాట్లాడుతూ.. ఓయూలో కొత్త భవనాలు, వసతుల కల్పన కోసం సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. రూ.వెయ్యి కోట్లు, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారని వెల్లడించారు.