KMM: బోనకల్ మండలం కలకోట వ్యవసాయ పరపతి సంఘం (PACS) అధ్యక్షుడిగా రాధాకృష్ణ బుధవారం నియమితులయ్యారు. గత అధ్యక్షుడు కర్నాటి రామకోటి సర్పంచ్ పోటీ చేస్తుండటంతో రాజీనామా చేయవలసి వచ్చింది. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాధాకృష్ణను డైరెక్టర్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నియామకానికి సహకరించిన డైరెక్టర్ లకు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.