NGKL: కల్వకుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల విధులకు శాంతిభద్రతలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.